Saturday, December 21, 2024

ప్రధాని మోడీ చెప్పినా.. కెసిఆర్ చేస్తలేడు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: తెలంగాణలో పేదప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఇండ్లు లేనటువంటి వారున్నారని, వారందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత మనదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ కు చెప్పారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పాలమూరులో బీజేపీ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహా ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “పాలమూరు మొదట్నుంచీ చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాల వేదిక. తెలంగాణ ఉద్యమంలోనూ ఇక్కడినుంచి బీజేపీని గెలిపించడంతో.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడాల్సి వచ్చింది. మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఇండ్లు కట్టించింది.

కానీ తెలంగాణలో మాత్రం 9 ఏండ్లు గడిచినా పేదప్రజల ఇండ్లు ముందుకు పడలేదు. ఆయన మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 10 ఎకరాలల్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో ఇళ్లు కట్టుకున్నడు. కాంగ్రెస్ పార్టీ భవనానికి 10 ఎకరాలు ఇచ్చి.. టీఆర్ఎస్ పార్టీ భవనానికి 11 ఎకరాలు తీసుకున్నరు. కానీ పేదలకు ఇండ్లకు మాత్రం స్థలం ఉండదా?. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ ఒక్కటే. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు కట్టుకున్నరు. కానీ పేదలకు ఇండ్లు లేవు. పేదలకు ఎన్ని ఇండ్లు కట్టినా కేంద్రం ఆర్థిక సాయం చేస్తదని మోడీ గారు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం నిద్రనటిస్తోంది.

అల్లుడెక్కడ పండుకోవాలె.. ఆడబిడ్డ ఇంటికొస్తే కష్టం కాదా అని తుపాకీ రాముడి మాటలు చెప్పిండు. అలాంటి వ్యక్తిని అధికారంలో ఉంచాల్సిన అవసరం ఉందా?. కేసీఆర్ కు బుద్ధిచెప్పాల్సిన సమయం ఇది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఇంకా అమలువుతున్నాయి తప్ప.. గత 9 ఏళ్లుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులే ఇవ్వలేదు. ఇవ్వాలన్న సోయికూడా వారికి లేదు. కొత్త పింఛన్లు లేవు. వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం లేదు. ఎన్నికలు రాంగానే భారీగా హామీలు ఇస్తరు. కానీ వాటిని అమలు చేయరు. టీఆర్ఎస్ నాయకులను ప్రజలమీదికి వదిలి.. తమను ప్రశ్నించిన వారిమీద దాడిచేయిస్తున్నరు. దళితుడిని ముఖ్యమంత్రిని చేసి కాపలా కుక్కలాగా ఉంటా అన్నడు. అధికారంలోకి వచ్చినాంక.. దళితులకు వెన్నుపోటు పొడిచి, సీఎం సీట్లో కూర్చున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది” అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News