రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా లు తమ తాజా కలెక్షన్ ‘ఈక్వినాక్స్’ని FDCI ఇండియా కోచర్ వీక్‌లో ఆవిష్కరించారు. శోభితా ధూళిపాళ, ఇషాన్ ఖట్టర్ షో స్టాపర్‌లుగా ఈ కలెక్షన్ తో ర్యాంప్ పై హొయలొలికించారు. కోల్‌కతా కేంద్రం గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బదాలియా డైమండ్స్, మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకమైన ఇండియా కోచర్ వీక్ లో మెరుపులు మెరిపించింది. శశి భాయ్, గోలు భాయ్‌లచే అభివృద్ధి చేయబడిన నాలుగు తరాల కుటుంబ-సహజ వజ్రాల ఆభరణాల బ్రాండ్ బదాలియా డైమండ్స్.
“ అత్యుత్తమ ఆధునిక కళ, ఫ్యాషన్, జ్యువెలరీ డిజైన్‌ను ఈ షో అందించింది. ఈ అద్భుతమైన ప్రదర్శన కోసం రోహిత్ గాంధీ + రాహుల్ ఖన్నాతో వారి అధికారిక జ్యువెలరీ భాగస్వాములుగా చేతులు కలిపినందుకు సంతోషిస్తున్నాము. మా డైమండ్ ఆభరణాల యొక్క ప్రత్యేకమైన డిజైన్‌లు, హస్తకళలు డిజైనర్ ద్వయం యొక్క అత్యుత్తమ క్రియేషన్‌లను మరింత మెరుగ్గా చూపాయి” అని బదాలియా డైమండ్స్‌కు చెందిన గోలు బదాలియా అన్నారు.
“మా సెలెస్టియల్ కలెక్షన్స్ స్టార్‌లైట్ నెక్లెస్ అనేది వెన్నెల రాత్రిలో నక్షత్రాల నృత్యానికి అద్దం పట్టే వజ్రాల యొక్క క్లిష్టమైన అమరిక. గెలాక్సీ లాకెట్టు అనేది విశ్వం యొక్క అద్భుతం, రహస్యం యొక్క భావాన్ని రేకెత్తిస్తూ, తిరుగుతున్న కాస్మిక్ నెబ్యులాల యొక్క అద్భుత ప్రదర్శన. మా డిజైన్‌లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా ఈక్వినాక్స్ కోచర్ 23 కలెక్షన్‌ను సంపూర్ణం చేశాయి అని బదాలియా డైమండ్స్ బై శశి భాయ్ & గోలు భాయ్ డైరెక్టర్ ఇష్మితా బదాలియా అన్నారు. డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నాలు మాట్లాడుతూ..”విశ్వాసం, కల్పిత కథల సమ్మేళనం ఈక్వినాక్స్ కలెక్షన్” అని అన్నారు.