Saturday, December 21, 2024

ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్

- Advertisement -
- Advertisement -

మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా అధికారులపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా ఐఎఎస్ అధికారులపై కేసు నమోదు చేయాలని ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం ఆదేశించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల సంఘానికి అఫిడవిట్ ను సమర్పించారు. 2018 నవంబర్ 14న శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అఫిడవిట్ ను కూడ సమర్పించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడడానికి రెండు రోజుల ముందు ఇసి వెబ్ సైట్ లో కొత్త అఫిడవిట్ అప్ లోడ్ చేసిన ట్టుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఫిర్యాదు చేశారు. తొలుత ఇసికి సమర్పించిన అఫిడవిట్ స్థానంలో కొత్త అఫిడవిట్ ను సమర్పించి నట్టుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కొందరు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ఎన్నికల అధికారులతో పాటు రిటర్నింగ్ అధికారులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ అవాస్తవమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ ఏడాది జనవరి మాసంలో ఆరోపించారు. తనపై చేసిన ఫిర్యాదు వెనుక ఓ మాజీ మంత్రి, ఓ మాజీ ఎంపి ఉన్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఇదిలా ఉంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తెలంగాణ హైకోర్టులో కూడ పిటిషన్ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చారని రాఘవేందర్ రాజు అనే వ్యక్తి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కొట్టివేయా లని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 25న కొట్టివేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News