Sunday, April 13, 2025

జిమ్నాస్టిక్స్‌లో పతకాల పంట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్రలోని పుణె నగరంలో జరిగిన జిమ్నాస్టిక్స్ పోటీల్లో తెలంగాణకు చెందిన విష్ణునగర్ జిమ్నాస్టిక్స్ ఇనిస్టిట్యూట్ క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఈ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు రికార్డు స్థాయిలో 80 పతకాలు గెలుచుకున్నారు. ఇందులో 28 స్వర్ణాలు, 24 రజతాలు, మరో 28 కాంస్య పతకాలు ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో బరిలోకి దిగిన రాష్ట్ర జిమ్నాస్ట్‌లు అసాధారణ ప్రతిభతో పతకాలను సొంతం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను జిమ్నాస్టిక్స్ ఇనిస్టిట్యూట్ కార్యదర్శి బాల్‌రాజ్, సిఇఓ అజిత్, కోచ్‌లు రిథిక్ మిశ్రా, అశోక్ తదితరులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News