హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ మండలి సమావేశమైన విషయం తెలిసింది.. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది.. టిఎస్ఆర్టిసి ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది..
ప్రభుత్వ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు… దీనికి సంబంధించిన విధి విధానాలు నిబంధనలు రూపొందించేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు..
త్వరలో జరిగే వర్షాకాల సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.. ఆర్టీసీను కాపాడేందుకు ప్రజా రవాణాను పటిష్ట పరిచేందుకు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు.టిఎస్ఆర్ టిసి ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల సంబరాలు అంబరాన్ని అంటాయి.. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వన్ డిపో ముందు కార్మికులు సీట్లు పంచుకొని పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించుకుంటున్నారు.