Friday, December 20, 2024

మారుతీ సుజుకీ లాభం రూ.2,485 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో (ఏప్రిల్‌జూన్) దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం వార్షికంగా 145 శాతం పెరిగి రూ.2,485 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం 1,012.8 కోట్లుగా ఉంది. అయితే క్యూ4(జనవరిమార్చి)తో పోలిస్తే లాభం 5.27 శాతం తగ్గింది. మార్చి త్రైమాసికంలో ఇది రూ.2,623.6 కోట్ల లాభం వచ్చింది. క్యూ1లో కంపెనీ ఆదాయం రూ.26,499 కోట్ల నుంచి రూ.32,326.9 కోట్లకు పెరగ్గా, ఇది వార్షికంగా 22 శాతం వృద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో నికర లాభం పెరగడానికి అధిక విక్రయాల వాల్యూమ్‌లు, ఖర్చు తగ్గింపు, అధిక నాన్-ఆపరేటింగ్ ఆదాయం కారణమని కంపెనీ వర్గాలు తెలిపాయి.

మార్కెట్లో మారుతీ షేర్ రూ.142.70 పెరిగి రూ.9,813 వద్ద ముగిసింది. జూన్ త్రైమాసికంలో మారుతీ 498,030 వాహనాలను విక్రయించగా, గతేడాదితో పోలిస్తే 6.4 శాతం పెరిగాయి. దేశీయ మార్కెట్లో విక్రయాలు 9 శాతం వృద్ధితో 4,34,812 యూనిట్లకు, ఎగుమతులు 9 శాతం క్షీణించి 63,218 యూనిట్లకు చేరుకున్నాయి. త్రైమాసికం చివరిలో పెండింగ్‌లో ఉన్న కస్టమర్ ఆర్డర్‌లు సుమారుగా 3,55,000 వాహనాలు ఉన్నాయి. ఈ ఆర్డర్‌లను త్వరితగతిన పూర్తి చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా 28,000కు పైగా వాహనాలను తయారు చేయలేకపోయామని కంపెనీ తెలిపింది.

దాని ఎనర్జీ లాభం 51 శాతం జంప్
మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఫలితాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం 51 శాతం పెరిగి రూ.323 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.214 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 33 శాతం పెరిగి 2,176 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.1,635 కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News