Monday, December 23, 2024

దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి 71 పోస్టుల భర్తీ

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి 71 పోస్టులు భర్తీ చేస్తూ సోమవారం జరిగిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే దుబ్బాక ప్రభుత్వాసుపత్రి 100 పడకలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుంది. ఈ 71 పోస్టులు భర్తీ కావడంతో ప్రజలకు మరింత సేవలు అందరూ ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు వైద్య చెవుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే అందించాలని లక్ష్యంతో పోస్టులను భర్తీ చేయనున్నారు.

వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సిఎం అయ్యాక వైద్య రంగానికి పెద్దపీట వేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి 71 పోస్టులు భర్తీ అయ్యాయని అన్నారు. ఈ పోస్టుల భర్తీతో ప్రజలకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News