Sunday, November 3, 2024

వరదలు, పంట నష్టంపై గవర్నర్‌కు కాంగ్రెస్ వినతిపత్రం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః రాజ్‌భవన్‌లో గవర్నర్ తిమిళిసైతో సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో రైతులు నష్టపోయిన పరిస్థితులను గవర్నర్ కు వివరించారు. వరదలు, పంట నష్టం బాధితులకు నష్ట పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు భట్టీ బృందం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భట్టీ మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను సాంకేతిక లోపంతో కట్టడం వల్లే ప్రమాద జరిగిందని ౠయన ఆరోపించారు. సిఎం కెసిఆర్ తన రాజకీయాల కోసం అధికార యంత్రాంగాన్ని వాడుతున్నారని భట్టీ విమర్శించారు.

ఈ కార్యక్రమంలోఎఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజనీ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News