Monday, December 23, 2024

అట్టర్‌ప్లాప్ సినిమాను అద్భుతం అంటున్నారు: అంబటి రాంబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా అందజేశారని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. బ్రో సినిమా నిర్మాత టిడిపికి చెందిన విశ్వ ప్రసాద్ అని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌మనీని వైట్‌మనీగా చేసి పవన్ కల్యాణ్ అందించారని ఆరోపణలు చేశారు. అమెరికా నుంచి పవన్ కు వస్తున్న డబ్బు పెద్ద స్కామ్ అని దుయ్యబట్టారు. ఈ సినిమాలో తన శత్రువులను తిట్టాలని పవన్ అనుకున్నారని, అందుకే సినిమా అట్టర్ ప్లాప్ అయిందని అంబటి చురకలంటించారు.

Also Read: కాలువలో ముఖం కడుగుతుండగా యువకుడిని చంపిన మొసలి

బ్రో సినిమా కలెక్షన్లు పెంచుకునేందుకు తాపత్రయం పడుతున్నారని ధ్వజమెత్తారు. అట్టర్‌ప్లాప్ సినిమాను అద్భుతమని చెబుతున్నారని, సినిమా కలెక్షన్లు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయని, కాంట్రావర్సీ చేసి కాసులు రాల్చుకునేందుకు కక్కుర్తి పడ్డారని అంబటి మండిపడ్డారు. పవన్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా బ్రో సినిమాకు రాలేదని ఎద్దేవా చేశారు. తాము కూడా త్వరలో సినిమా తీస్తున్నామని, నిత్య పెళ్లికొడుకు, పెళ్లిల్లు పెటాకులు, బహుభార్య ప్రవీణ్యుడు, తాళి-ఎగతాళి, మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు వంటి టైటిల్స్ ఆలోచిస్తున్నామని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News