Sunday, November 24, 2024

సిఎం కెసిఆర్, మంత్రుల ఫొటోలకు పాలాభిషేకాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ కేబినేట్ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై ఉద్యోగులు, కార్మికులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసి డిపోల ఎదుట కార్మికులు, ఉద్యోగులు సిఎం కెసిఆర్, మంత్రుల ఫ్లెక్సీలకు మంగళవారం పాలాభిషేకం చేశారు. టిఎస్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా జీడిమెట్ల ఆర్టీసి డిపో వద్ద ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతగా జీడిమెట్ల ఆర్టీసి డిపో వద్ద ఆర్టీసి ఉద్యోగులు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు సన్మానించి పటాకులు కాల్చారు. వికారాబాద్ జిల్లాలో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసి ఉద్యోగులు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా నగరంలో మెట్రో విస్తరణను చేపడతామని సిఎం కెసిఆర్ ప్రకటించడంతో నగర ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లోని బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. అందులో భాగంగా బిఆర్‌ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ ఫ్లెక్సీకి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News