Sunday, December 22, 2024

మెడికో థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

యూనిక్ థ్రిల్లర్ ‘హిడింబ’లో తన అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ నటనతో అందరినీ సర్‌ప్రైజ్ చేసిన టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రానికి సిద్ధమవుతున్నారు. అశ్విన్ బాబు 8వ చిత్రం ‘ఎబి8’ను మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు.

షణ్ముఖ పిక్చర్స్‌పై ఆలూరి సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆలూరి హర్షవర్ధన్ చౌదరి సమర్పిస్తున్నారు. అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. మెడికో థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్ స్టెతస్కోప్ పట్టుకున్న హీరో చేతిని చూపిస్తుంది. అతని ముఖాన్ని చేయి కవర్ చేస్తోంది. చేతి నుండి రక్తం కారుతోంది. కథనంలో ట్విస్ట్ అండ్ టర్న్ ఉండే ఈ సినిమా కోసం అశ్విన్ బాబు ఫిజికల్‌గా మేకోవర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News