Sunday, November 24, 2024

హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: రెండు వర్గాల మధ్య ఘర్షణతో హర్యానాలోని నూహ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజులుగా జరుగుతున్న కాల్పులు, ఘర్షణల్లో ఇద్దరు హోం గార్డులు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. వీరిలో ఓ మతానికి చెంది గురువు ఉన్నట్లు సమాచారం. ఘర్షణల్లో ఇప్పటి వరకు దాదాపు 70 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. నూహ్‌జిల్లాకు ఆనుకొని ఉన్న గురుగ్రామ్‌లోనూ ఈ ఘర్షణల ప్రభావం పడింది. ఇక్కడి బాద్‌షాపూర్‌లో అల్లరి మూక పలు షాపులు, హోటళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు.

మంగళవారంనాడు కూడా నూహ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. దాంతో ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ విధించినట్లు హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అలాగే భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 20 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. వందలాది మంది మూడు గంటలపాటు ఓ దేవాలయంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ దేవాలయం సమీపంలో ఉన్న ఎత్తయిన గుట్టలపై నుంచి దుండగులు కాల్పులు జరుపుతూ, రాళ్లు విసురుతూ స్వైర రవిహారం చేస్తుంటే, దాదాపు 2,500 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

బాధ్యుల్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఈ ఘటన దురదృష్టకరం. రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని కోరుతున్నాను. బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం అని భరోసా ఇచ్చారు. ఘర్షణల వెనక కుట్ర ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు. అలాగే మంగళవారంనాడు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సామాజిక మాధ్యమంలో ఉంచిన ఒక వీడియో దీనంతటికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News