Monday, November 25, 2024

శ్రీలంకలో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్ గుప్తా నేతృత్వంలో మహిళలతో శ్రీలంక దేశంలో సీతమ్మ వాటిక (ఆశోక వన ప్రాంగణం)లో 150 మంది ఐవిఏఫ్ ప్రతినిధులు 11 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆత్మీయ సమావేశం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి కోడిపాక నారాయణ, ఉప్పల స్వప్న, మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, జెడ్పిటిసి సభ్యురాలు మేఘమాల ప్రభాకర్ , మణిమాల, భువనే శ్వరి, శాంతి, శైలైజ, జ్యోతి, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ నాగమణి, గజ్వేల్ మున్సిపల్ కౌన్సిలర్ నంగూనూర్ సత్యనారాయణ, కోటగిరి దైవదినం, ఓరగంటి పరమేశ్వర్, రాము, నాగరాజు, తోట బిక్షపతి, శివశంకర్, రమేష్, బిజ్జాలశ్రీనివాస్ ,టి వీరన్న, ఎ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

హరిత ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటిన మహతి
రాజ్య సభ సభ్యులు, పర్యావరణవేత్త గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, హరితబంధు జోగినపల్లి సంతోష్ కుమార్ హరిత ఉద్యమ స్పూర్తి తో మహతి మొక్కలు నాటారు. తెలంగాణరాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు సుమిత్రానంద్ తానోబ ఆనంద్‌రావు దంపతుల కుమార్తె మహతి తన 12 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మూడు మొక్కలు నాటింది. కొంపల్లిలోని తన ఇంటి ఆవరణలో రామసితాఫలం, వాటర్ యాపిల్ , యాపిల్ మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో తాను కూడా పాలు పంచుకున్నది. తన తరగతిలోని తన తోటి విద్యార్థులకు మొక్కల పెంపకం అవశ్యకతను ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలను వివరి స్తానని మహతి ఈ సందర్భంగా తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News