Tuesday, November 26, 2024

హీరో మోటో చైర్మన్ ఇంటిపై ఇడి దాడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్, మరికొందరి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ) దర్యాప్తులో భాగంగా ఇడి ఈ చర్య తీసుకుంది. ఇడి దాడుల తర్వాత ఢిల్లీ, గూర్గావ్ కార్యాలయాలపై దాడుల వార్తలను ధృవీకరిస్తూ హీరో మోటోకార్ప్ ఒక ప్రకటన విడుదల చేసింది.

2018 ఆగస్టులో ఢిల్లీ విమానాశ్రయంలో పవన్ ముంజాల్‌ను విమానం నుంచి లోడ్ చేశారు. పవన్ ముంజాల్‌తో పాటు ప్రయాణిస్తున్న అమిత్ బాలి నుంచి సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ తనిఖీలో రూ.81 లక్షల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) విచారణ చేపట్టింది.

ఈ ఇన్‌పుట్ ఆధారంగానే ఇప్పుడు ఇడి దాడులు చేసింది. ఇడి దాడుల వార్తల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ షేర్లు 3.24 శాతం పడిపోయి రూ.3,103 వద్ద ముగిశాయి. ట్రేడింగ్‌లో ఇది రూ.3032 కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు 2022 మార్చి 22న ముంజాల్ తన ఖాతాలో బోగస్ ఖర్చులు చూపించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటి) దాడులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News