Saturday, December 21, 2024

మలావి ప్రథమ మహిళా స్పీకర్ సన్మాన కార్యక్రమంలో…

- Advertisement -
- Advertisement -
అతిథిగా పాల్గొనడం చిరస్మరణీయమైన అనుభూతి : ఎంపి జోగినపల్లి సంతోష్

హైదరాబాద్ : ఇండియా వైస్‌ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఆహ్వానానికి తానెంతో గర్వపడుతున్నానని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. మలావి ప్రధమ మహిళా స్పీకర్ కేథరీన్ గోటనిహార్ సన్మాన కార్యక్రమంలో తాను అతిథిగా పాలుపంచుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇది తనకెంతో చిరస్మరణీయమైన అనుభూతిగా మిగిలిపోనుందని తెలిపారు. అంతేకాక, వివిధ సమస్యలపై స్పీకర్ మేడమ్, ఇతరులతో సంభాషించే అవకాశం ఈ ఆహ్వానం ద్వారా తనకు లభించిందన్నారు. ఇందుకు సంబంధించి తాను పాల్గొన్న ఇమేజ్‌లను ఆయన తన ట్విట్టర్‌లో పంచుకున్నారు.

Santosh 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News