Saturday, December 21, 2024

ఈ నెల 7 నుంచి టిజెఎస్ మహా పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

పాదయాత్ర పోస్టర్‌ను విడుదల చేసిన ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీచేసిన భూ సేకరణ నోటిఫికేషన్ వల్ల గత 24 ఏళ్లుగా నాదర్ గుల్, ఆదిబట్ల, ఎంఎం కుంట గ్రామాల ప్రజలు భూ దోపిడీకి గురయ్యారని తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అప్పటిప్రభుత్వం అవరమున్న భూమిని సేకరించడంతో పాటు అవసరం లేని భూమిని కూడా అన్యాయంగా ప్రభుత్వ ఖాతాలో చేర్చుకుందని విమర్శించారు. – ఆ భూమిలో దాదాపు 20 వేల ప్లాట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి టిజెఎస్ చేపట్టనున్న ‘హార్డ్ వేర్ పార్క్ హటావో తెలంగాణ బచావో’ మహా పాదయాత్ర ‘ పోస్టర్‌ను ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ భూమికి సంబంధించి ఎపి/టిఎస్‌ఐఐసి నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. అక్రమ ఎక్స్ టెన్షన్ హార్డ్ వేర్ పార్క్ ని తొలగించాలని కోదండరాం డిమాండ్ చేశారు.  భాదితులకు అండగా ఉంటామన్నారు.

అనేక పోరాటాల తర్వాత ఈ ప్రభుత్వం ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసిందని అన్నారు. సమ్మె కాలంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో వరదలపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గురుకుల పరీక్ష నిర్వాహణ ఉందని. మొదటి రోజు ఒక జిల్లాలో రెండవ రోజు ఇంకో జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు ఎలా ప్రయాణిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఆలోచించి అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. టిజెఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దార సత్యం మాట్లాడుతూ మహా పాదయాత్ర -ఆగస్టు 7న నాదర్ గుల్ సెంటర్ లో ప్రారంభమై ఆదిబట్ల మీదుగా రంగారెడ్డి కలక్టరేట్ వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ‘నేను ఒక బాధితుడిని, – మా బాధలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. అవసరానికి మించి 1000 ఎకరాలు వ్యవసాయానికి పనికిరాదంటూ భూసేకరణ చేపట్టారు ’ అని ఆయనన్నారు.  ఈ సమస్య అందరికి తెలియచేయడానికే పాదయాత్ర చేపడుతున్నాం  అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News