Monday, December 23, 2024

‘బ్రో’ మూవీపై ఈడికి ఫిర్యాదు..?

- Advertisement -
- Advertisement -

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో’ మూవీ  బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘బ్రో’ మూవీపై ఎపి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఈడికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

అక్రమ ఫండింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈరోజు(బుధవారం) సాయంత్రం పలువురు పార్టీ ఎంపిలతో కలిసి ఢిల్లీకి వెళ్లి ‘బ్రో’ సినిమాపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు అంబటి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News