Monday, December 23, 2024

రూ. 3000 అప్పు తీసుకున్న వ్యక్తి కత్తిపోట్లకు బలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీ టిగ్రీ ప్రాంతంలో సంగం విహార్‌కు చెందిన 21 ఏళ్ల యూసఫ్ అలీ తన వద్ద అప్పుతీసుకున్న రూ. 3000 తిరిగి ఇవ్వడం లేదన్న కోపంతో షారూఖ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపిన దారుణ సంఘటన బుధవారం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వడం లేదని నాలుగు రోజుల కిందట షారూఖ్ తన కుమారుడిని అదే పనిగా బెదిరించడం చేశాడని యూసఫ్ తండ్రి సహాద్ అలీ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం ఒక షాపు వద్ద ఉన్న యూసఫ్ అలీపై షారూఖ్ కత్తితో దాడి చేశాడు.

ప్రతిఘటించేందుకు యూసఫ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో అక్కడున్న వారెవరూ ఏమీ చేయలేకపోయారు. చివరకు ఆలీ కుప్పకూలిన తరువాత నిందితుడు షారూఖ్‌ను కొందరు పట్టుకుని కొట్టారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చందన్ చౌదరి చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయింది. సంగం విహార్ కె2 బ్లాక్‌లో ఉంటున్న షారూఖ్ ను పట్టుకున్న తరువాత వైద్య చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. షారూఖ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News