- Advertisement -
న్యూఢిల్లీ : మణిపూర్ లోని హింసాత్మక సంఘటనల కారణంగా స్కూళ్లకు వెళ్లలేని 14 వేల మంది పిల్లలను సమీప స్కూళ్లలో అడ్మిట్ చేయించినట్టు కేంద్ర విద్యా సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. రాజ్యసభలో బుధవారం అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా వివరించారు. మొత్తం 14, 763 మంది పిల్లలు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడగా, వీరిలో 93.5 శాతం మంది సమీప స్కూళ్లలో ప్రవేశ పెట్టినట్టు చెప్పారు. నిర్వాసితులైన విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్ వేరే చోట జరిగేలా ఈ ప్రక్రియను సులువు చేసేందుకు ప్రతి పునరావాస కేంద్రంలో నోడల్ ఆఫీసర్‌ను నియమించడమైందని వివరించారు.
- Advertisement -