Saturday, January 11, 2025

వరద నష్టాలపై సమగ్ర నివేదికలివ్వండి

- Advertisement -
- Advertisement -

ములుగు,జయశంకర్ భూపాలపల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్ట పోయిన గ్రామాలను కేంద్ర బృందం పర్యటించింది. ఎన్‌డిఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి ఆధ్వర్యంలో భూపాలిపల్లి, ములుగు జిల్లాలను పర్యటించి కలెక్టర్ల ద్వారా వివరాలు సేకరించారు. వరద ప్రభావంతో జరిగిన నష్టంపై నిబంధనల ప్రకారం అంచనా వేసి నివేదిక సమర్పించాలని సూచించారు.బుధవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నిబంధనల మేరకు వరద నష్టం అంచనాలను పకడ్బందీగా రూపొందించామని తెలిపారు. కేంద్ర బృందం సభ్యులకు జిల్లాలో వరదల ద్వారా జరిగిన నష్టం, భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు ఇళ్లు, రహదారులు వివిధ శాఖల ద్వారా దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రహదారులు వివిధ శాఖల ద్వారా నష్టాన్ని వివరించారు.

చిట్యాల, రేగొండ, గణపురం మండలాలలో 600 సెంటిమీటర్లకు పైగా భారీ వర్షం కురవడంతో భూపాలపల్లి జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఆరు మండలాల్లో 32 గ్రామాలు దెబ్బతిన్నాయని, నలుగురు మరణించారని మరో వ్యక్తి గల్లంతయ్యారని తెలిపారు. భారీ వరదలన కారణంగా మొరంచపల్లి గ్రామం ముంపుకు గురైందని, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాల సహకారంతో గ్రామస్తులతో రెండు పునరావాస కేంద్రాలకు తరలించామని, వరదల తగత్గిన తర్వాత గ్రామంలో వరద నష్టం అంచనా వేసి ప్రతి ఇంటిని శుభ్రం చేసి, త్రాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్దరించాలని, ప్రతి ఇంటిలో వస్తువులు నష్టం జరిగిందని అన్నారు. భారీ వరదతో 10,528 విద్యుత్ స్తంభాలు, 1532 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ర్మర్లు, 23 సబ్‌స్టేషన్ దెబ్బతిన్నాయని, 162 నీటి వనరులు నష్టపోయాయని, 10 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బి రోడ్డు, 100 కిలోమీటర్లు పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని,

42 ఇండ్లు పూర్తిగా, 486 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 15690 ఎకరాల్లో వరి, 15381 ఎకరాలలో పత్తి, 2500 ఎకరాలలో మిర్చి, 264 ఎకరాలలో ఇతర పంటలు నష్టం వాటిల్లిందని వివరించారు. అనంతరం కేంద్రం బృందం సభ్యుల టీం లీడర్, ఎన్‌డిఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి మాట్లాడుతూ వరదల వలన జరిగిన నష్టంపై నిబంధనల ప్రకారం అంచనా వేస్తూ పకడ్బందీ నివేదిక అందించాలని తెలిపారు. నీటి పారుదల శాఖ క్రింద దెబ్బతిన్న చెరువులు, కాలువలు మరమ్మత్తులకు ప్రతిపాదనలు అందించాలని, విద్యుత్ శాఖకు సంబంధించి దెబ్బతిన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు స్తంభాలలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్న వాటిని మినహాయించి మిగిలిన వాటి వివరాలు అందించాలని పేర్కొన్నారు. అనంతరం మొరంచపల్లి గ్రామంలో కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు.

వరద నష్టం పై కేంద్ర బృందం ములుగు జిల్లా పర్యటన ః
వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంషన్ ద్వారా జిల్లా ప్రత్యేక అధికారి ఎస్ కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. జిల్లాలో వరి 3135 ఎకరాలు, పత్తి 3020, మిర్చి 124, హార్టికల్చర్ క్రాప్స్ 38, సాండ్ కాస్టింగ్ 1450 ఎకరాలు మొత్తం 7766 ఎకరాల పంట నష్టం జరిగిందని అన్నారు. 17 మంది ప్రాణాలు కోల్పోయారని 624 జంతువులు చనిపోయినట్లు తెలిపారు. 10 చెరువులు, 32 దొడ్ల బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు. జిల్లాలో 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 5861 మందికి ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ రెస్యూ బృందాలు, ప్రయివేట్ బోట్లు స్విమ్మర్‌లను అన్ని మండలాలో ఏర్పాటు చేశామని అన్నారు.

అనంతరం గోవిందరావు పేట మండలం పస్రా గుండ్లవాగు వద్ద ద్వసం అయిన జాతీయ రహదారిని, తాడ్వాయి మండలం జలగలంచ కల్వర్ట్ వద్ద ద్వంసం అయిన జాతీయ రహదారిని కేంద్ర బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, రీజినల్ ఆఫీసర్ కుష్వా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ పూనుస్వామి, హైదరాబాద్ ఎన్‌ఆర్ ఎస్సీ డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే, జిల్లా ఎస్పీ గాష్ ఆలం, డిఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News