- Advertisement -
హైదరాబాద్: నిరుద్యోగ భృతి డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని ముట్టడించారు. గురువారం ఉదయం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
దీంతో అసెంబ్లీని ముట్టడించేందుకు దూసుకొచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, నగర అధ్యక్షుడు మోటా రోహిత్ తోపాటు పలువురు నేతలను నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
- Advertisement -