Tuesday, December 24, 2024

ఎక్సైజ్ నోటిఫికేషన్ లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

జిఓ 98ను సవరించి నోటిఫికేషన్ ఇవ్వాలి
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వినతి

హైదరాబాద్ : వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ నోటిఫికేషన్‌ను సవరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌లు అమలు చేయకుండా విడుదల చేసిన జిఓ 98 ని సవరించి తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 2025 సంవత్సరాలకు మద్యం షాపులు నిర్వాహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. మద్యం షాపులో రిజర్వేషన్‌లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 5, 2021న జిఓ 98 విడుదల చేసిందని ఈ జిఓ ప్రకారం గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్‌సి 10 శాతం ,ఎస్‌టి 5 శాతం షాపులు కేటాయించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ జీఓలో ఎక్కడ కూడా వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని పేర్కొనలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని విడుదల చేసిన జీఓ 1 కి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ పాలసీ ఉందన్నారు. ఈ పాలసీ వికలాంగుల తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. .2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని చట్టం పేర్కొందని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చట్టానికి భిన్నంగా జీఓ 98 విడుదల చేసిందన్నారు. 2023-2025 సంవత్సరాలకు 2,620 వైన్ షాపుల కేటాయింపు కోసం టెండర్లను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ నోటిఫికేషన్ విడుదల చేసిందని తక్షణమే జీఓ 98ను సవరించి వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తూ ఎక్సైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన ఎక్సైజ్ నోటిఫికేషన్ రద్దు చేయకుంటే వికలాంగుల సంఘాలతో కలిసి టెండర్స్ అడ్డుకుంటామని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News