Monday, December 23, 2024

ప్రజలకు మరింత చేరువగా పరిపాలన

- Advertisement -
- Advertisement -
  • ఎంపిపి సుదర్శన్

మిడ్జిల్ : ప్రజలకు పరిపాలన చేరువ చేసే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి ప్రజల వద్దకు పాలనను మరింత దగ్గర చేసిందని ఎంపిపి సుదర్శన్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఈదుల బాయితండా నూతన గ్రామ పంచాయతీ భవనానికి జడ్పీటీసీ శశిరేఖబాలు, పిఏసిఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండుయాదవ్ , మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ పవర్‌లతో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అభివృద్ది పదంలో దూసుకుపోతుందని ముఖ్యంగా పట్టణాలకు గ్రామీణ ప రాంతాలు, తండాలకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తూ గ్రామ పంచాయతీలుగా చేపట్టి గిరిజనులు తమ తండాలను పాలించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రతి గ్రామ పంచాయతీలో నూతన పంచాయతీ భవనాలను నిర్మాణం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాస్కర్‌చౌహన్ , ఎంపీటీసీ రమేష్ నాయక్, రవి, మత్రు, పాండు, శంకర్ , దేశియ నాయక్ , సురేష్ , నంద్యా, రమేష్, తిరుపతి, చంద్రు, వెంకటేష్, శ్రీరాములు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News