Monday, December 23, 2024

వికిపీడియా, యాపిల్‌కు రష్యా జరిమానా

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యాసైనిక చర్యకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడమే కాక, దాన్ని తొలగించడంలో విఫలమయ్యారన్న నేరారోపణపై రష్యా కోర్టు సోమవారం వికిపీడియా, యాపిల్ సంస్థలకు జరిమానాలు విధించింది. ఈ మేరకు వికిపీడియా ఫౌండేషన్‌కు 3 మిలియన్ రూబుల్స్ (33,000 డాలర్లు) యాపిల్ కంపెనీకి 400,000 రూబుల్స్ (4400 డాలర్లు ) జరిమానాలు విధించింది. రష్యా మిలిటరీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని రష్యా మెజిస్ట్రేట్ కోర్టు వెల్లడించింది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు లేదా ప్రశ్నించినా రష్యా కఠిన చర్యలు తీసుకొంటుంది. ఈ విషయంలో కొంతమంది విమర్శకులు తీవ్రమైన శిక్షలు కూడా పొందారు. విపక్షనేత వ్లాదిమిర్ కారా ముర్జా రష్యా చర్యలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ 25 ఏళ్ల జైలు శిక్ష రష్యా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News