- Advertisement -
తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు కైలాష్ సత్యార్థి అభినందనలు
హైదరాబాద్ : ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2617 మంది పిల్లలను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతీయ సంఘ సంస్కర్త కైలాష్ సత్యార్థి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేవలం జులై నెలలో ఈ ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణ ద్వారా 2617 మంది పిల్లలను రక్షించడంతో పాటుగా 400కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 436 మంది నిందితులను అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్ర డిజిపి అంజనీకుమార్, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఎడిజి షీకా గోయల్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు.
- Advertisement -