Monday, December 23, 2024

అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వరకట్నం వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని ప్రకాశం జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌కు, సంధ్యారాణికి ఏడాది క్రితం వివాహమైంది. వివాహ సమయంలో ప్రవీణ్‌కుమార్‌కు మూడు లక్షల పదివేల నగదు, పది తులాల బంగారు ఆభరణాలు, ఫర్నీచర్ పెట్టారు. ప్రవీణ్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో వివాహం అయిన రెండు నెలల తర్వాత కాపురాన్ని హైదరాబాద్‌లో పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అదనపు కట్నం కావాలని ప్రవీణ్‌కుమార్, సంధ్యారాణిని వేధించడం ప్రారంభించాడు.

ఈ విషయం బాధితురాలు తల్లికి చెప్పడంతో అదనంగా కట్నం ఇవ్వలేమని అల్లుడితో చెప్పింది. అప్పటి నుంచి సంధ్యారాణిని ప్రవీణ్‌కుమార్ మరింత దారుణంగా వేధించడం ప్రారంభించాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక సంధ్యారాణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలియడంతో సంధ్యారాణి తల్లి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News