Saturday, December 28, 2024

న్యాయానికి లభించిన విజయమిది..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షను సుప్రీంకోర్టు నిలిపి వేయడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది నిజానికి లభించిన విజయంగా పేర్కొంది. తీర్పు వెలువడిన వెంటనే లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సుప్రీంకోర్టు తీర్పును ట్విట్టర్ ద్వారా స్వాగతిస్తూ‘ సూర్యుడు, చంద్రుడు, సత్యం అనే ఈ మూడింటిని ఎక్కువ కాలం దాచలేరు’ అన్న గౌతమ బుద్ధుడి సూక్తిని ఉటంకించారు. తీర్పు చెప్పిన సుప్రీంకోర్టుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘సత్యమేవ జయతే’ అంటూ రాసుకొచ్చారు.

సత్యం, న్యాయం జయిస్తాయనే దానికి ఈ తీర్పు బలమైన నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను లొంగదీసుకోవడానికి బిజెపి యంత్రాంగం అవిశ్రాంతంగా ప్రయత్నించినా ఆయన మాత్రం లొంగలేదని, న్యాయప్రక్రియపై విశ్వాసం ఉంచారని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. న్యాయం విజయం సాధించిందని పార్టీ మరో ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ప్రజాస్వామ్య హాళ్లలో మళ్లీ న్యాయ గర్జన వినిస్తుందన్నారు. మరో సీనియర్ నేత కెసి వేణు గోపాల్ కూడా సుప్రీం తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News