- Advertisement -
‘తలసేమియా’ వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారికి కొండంత భరోసా
హైదరాబాద్: మరోసారి మంత్రి కెటిఆర్ తన పెద్ద మనసు చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పట్ల ఆయన స్పందించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. రాజకీయపరమైన సమస్యలతో పాటు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై వచ్చిన ట్వీట్లకు స్పందించి, వెంటనే పరిష్కార మార్గాలను ఆయన చూపుతుంటారు. తాజాగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై స్పందిం చారు. చిన్నారికి మంచి వైద్యం అందించాలని తన టీమ్‌ను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. బాధిత బాలుడు ‘వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని రాయపర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ అశోక్ కుమారుడు. అశోక్ ట్వీట్‌కు మంత్రి కెటిఆర్ స్పందించి ఆ కుటుంబానికి కొండంత భరోసానిచ్చారు.
- Advertisement -