Friday, November 22, 2024

క్రికెట్‌కు అలెక్స్ హేల్స్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో భారత్‌తో జరిగిన టి20 మ్యాచ్‌తో హేల్స్ ఇంటర్నేషన్ క్రికెట్ కెరీర్‌కు శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచి ఇంగ్లండ్ టీమ్‌లోని అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో హేల్స్ 75 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అంతేగాక 70 వన్డేల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. దీంతోపాటు 11 టెస్టు మ్యాచ్‌లలో కూడా ఆడాడు. టెస్టుల్లో 573 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 2419 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు మరో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టి20లలో 2074 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో ఓ సెంచరీ, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కెరీర్‌లో అలెక్స్ హేల్స్ ప్రపంచ వ్యాప్తంగా పదికి పైగా ఫ్రాంచైజీలకు ప్రాతనిథ్యం వహించాడు. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఓవరాల్‌గా 405 టి20 మ్యాచ్‌లు ఆడిన హేల్స్ 11253 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ టీమ్‌లోని అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా ఓ వెలుగు వెలిగాడు. టి20, వన్డే వరల్డ్‌కప్‌లలో ఇంగ్లండ్ ట్రోఫీలను సాధించడంలో హేల్స్ కూడా కీలక పాత్ర పోషించాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు హేల్స్ శుక్రవారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News