Saturday, November 16, 2024

ప్రభుత్వం రెండవ పిఆర్సీకి కమిషన్ నియమించాలి : ఎంప్లాయిస్ యూనియన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు సిఎం కెసిఆర్ పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో రెండవ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి 20 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం జరిగిన అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దుచేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తేవాలని తెలిపారు. బకాయి ఉన్న మూడు దీపాలను వెంటనే ప్రకటించాలని 317 జీవో వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలని తెలిపారు – ఉద్యోగ ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News