Monday, December 23, 2024

పుతిన్ ప్రత్యర్థి అలెక్సీకి మరో 19 ఏండ్ల జైలు

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యాలో అధ్యక్షులు పుతిన్‌కు రాజకీయ విరోధి , విమర్శకులు అయిన అలెక్సీ నవల్నికి మరో 19 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు రష్యా కోర్టు నిర్థారించిన తరువాత ఇప్పటికే జైలులో ఉన్న ఆయన మరో 19 ఏండ్లు కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపక్ష నేత ఇప్పుడు పదకొండున్నర సంవత్సరాల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ప్రాసిక్యూషన్ ఆయనకు 20 ఏండ్లు జైలు శిక్ష విధించాలని కోరింది. ప్రత్యర్థికి చిరకాల శిక్షల విధింపులపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. పుతిన్ ఇప్పుడు స్టాలిన్‌కాలపు వేధింపుల రికార్డులను తిరగరాస్తున్నారని అలెక్సీ సన్నిహితులు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News