Saturday, December 21, 2024

శాసన మండలి నేటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శాసన మండలి శనివారానికి వాయిదా పడింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశమైన మండలిలో విద్య, వైద్యం, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుదీకరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం సభ శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. కాగా, శనివారం మండలిలో జీహెచ్‌ఎంసీలో ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్ల నిర్మాణం, ఎస్‌సిలకు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్లు, చేపల పెంపకం- ఉత్పత్తి, పారిశ్రామిక సముదాయాల ఏర్పాటు, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి ఆర్థిక సహాయం, హైదరాబాద్‌లోని పాతబస్తీలో రహదారుల నిర్మాణం, బిసి కులవృత్తిదారులకు ఆర్థిక సహాయం, దళిత బంధు పథకం, గొర్రెల యూనిట్ల పంపిణీ వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News