Monday, December 23, 2024

‘తూఫాన్ ఉఠావో.. ప్రపంచ కప్ జావో’ ప్రచారాన్ని ప్రారంభించిన థమ్స్ అప్

- Advertisement -
- Advertisement -

కోకా-కోలా కంపెనీకి చెందిన భారతదేశపు స్వదేశీ పానీయాల బ్రాండ్ థమ్స్ అప్, ఐసీసీ అధికారిక పానీయ భాగస్వామిగా తన తాజా ప్రచారం ‘తూఫాన్ ఉఠావో, ప్రపంచ కప్ జావో’ తో క్రికెట్ ప్రేమికుల అభిరుచిని రేకెత్తించడానికి సిద్ధంగా ఉంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం ఎదురుచూపులు భారతదేశంలో కొత్త ఎత్తుకు చేరుకున్నందున, థమ్స్ అప్ వినూత్న ప్రచార కార్యక్రమం ఈ సంవత్సరం ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌ను ఏ జట్టు గెలుస్తుందో అని భావించే ప్రతి క్రికెట్ అభిమాని అంతర్గత గందరగోళాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశంలో అందరినీ ఏకం చేసే శక్తి క్రికెట్ అని గుర్తిస్తూ, ఈ ప్రచార కార్యక్రమం భారత క్రికెట్ అభిమా నుల అచంచలమైన అభిరుచిని పెంచుతుంది. వారు రాబోయే ప్రపంచ కప్‌పై తమ ప్రత్యేక దృక్కో ణంతో వారు తమను తాము నిపుణులుగా భావిస్తారు. ఈ ప్రగాఢ అనుబంధంతో థమ్స్ అప్ ఈ సంవత్సరం ఐ సీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు దేశం ఉత్సాహం, నిరీక్షణకు స్వరూపంగా మారింది.

ఈ రకమైన ప్రచార కార్యక్రమం మార్కెటింగ్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా భారతీయ అభి మానులతో ప్రగాఢ స్థాయిలో అనుసంధానం అవడం పట్ల థమ్స్ అప్ కు గల నిబద్ధతను కూడా ప్రదర్శి స్తుంది. ప్రచార సమీకృత విధానం అనేది డేటా, సాంకేతికత, కంటెంట్ ద్వారా శక్తివంతమైనది. ఐసీసీ ప్రపంచ కప్ సమయంలో దేశం పల్స్‌ గా థమ్స్ అప్‌ను ఉంచింది. భారతదేశం సగర్వంగా ప్రపంచ కప్‌ను నిర్వహిస్తుండటంతో, దేశీయంగా ఎదిగిన ఈ బ్రాండ్ విజేత జట్టును అంచనా వేయడానికి అభిమానులను ఆహ్వానిస్తుంది. థమ్స్ అప్‌ని కొనుగోలు చేయడం ద్వారా, ప్రత్యేక కోడ్‌ ను కనుగొనడం, డిజిటల్ విజయ నాణేలను సేకరించడం ద్వారా వినియోగదారులు గేమ్‌ను ప్రత్యక్షం గా చూసే అవకాశాన్నికూడా పొందగలుగుతారు.

ఈ ప్రచార కార్యక్రమం క్రికెట్‌పై భారతదేశం అపారమైన ప్రేమకు వందనం చేస్తుంది. ఐసీసీ ప్రపంచ కప్ అం తటా అనుబంధం, సాధికారత, సామూహిక ఆనందంల ప్రయాణంగా పనిచేస్తుంది. ప్రచారానికి మరింత ఉద్వేగాన్ని జోడించడానికి, థమ్స్ అప్ ఐకానిక్ స్ప్లిట్ క్యాన్ ప్యాకేజీ ప్రపంచ కప్ విజేతపై అభిమానుల సందిగ్ధతను సూచిస్తుంది. ఈ ప్రచార కార్యక్రమం గురించి కోకా కోలా ఇండియా అండ్ సౌత్-వెస్ట్ ఆసియా, స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ సీనియర్ కేటగిరీ డైరెక్టర్ టిష్ కాండేనో మాట్లాడుతూ… “ఈ సంవత్సరం ప్రపంచ కప్ కోసం ఉత్కంఠ పెరుగుతోన్న సందర్భంలో, మా ఇంటిగ్రేటెడ్ క్యాంపెయిన్ ‘తూఫాన్ ఉఠావో, వరల్డ్ కప్ జావో’ మొదటి దశ క్రికెట్ పట్ల భారతదేశం ప్రేమను స్వీకరిస్తుంది. అభిమానులు తమ అభిమాన క్రికెట్ జట్టుకు తమ మద్దతును వినిపించేందుకు శక్తి నిస్తుంది. మా స్ప్లిట్ క్యాన్ ప్యాకేజింగ్‌తో కలిసి, ICC ప్రపంచ కప్ సమయంలో థమ్స్ అప్ దేశపు పల్స్ అవుతుంది’’ అని అన్నారు.

థమ్స్ అప్‌తో తన అనుబంధం గురించి ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే మాట్లాడుతూ.. ‘‘ICC ప్రపంచ కప్ 2023, థమ్స్ అప్ ‘తూఫాన్ ఉఠావో, ప్రపంచ కప్ జావో’ కోసం ఈ ఆకర్షణీయమైన ప్రచార కార్య క్రమంలో భాగమైనందుకు నేను పూర్తిగా సంతోషిస్తున్నాను. భారత క్రికెట్ అభిమానుల అభిరుచికి సాక్ష్యం గా నిలవడం ఎల్లప్పుడూ సంతోషకరమైన అనుభవం. ఉత్సాహాన్ని మరింత ఎత్తుకు పెంచేందుకు ఈ ప్రచార కార్యక్రమం వాగ్దానం చేస్తుంది’’ ఇలా అన్నారు.

ఓగిల్వీ ఇండియా(నార్త్) సీసీఓ, రీతు శారదా మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రపంచకప్ లో భారత్ గెలుస్తుంది లేదా భారత్ గెలుస్తుందా అనే చర్చ ప్రతి భారతీయుడి మదిలో తూ ఫాన్‌ను రేపుతోంది. మేం మన జట్టుకు అండగా నిలబడి, వారు గెలుస్తారని విశ్వసిస్తున్నప్పుడు, ఈ ప్ర పంచ కప్‌ను ఉద్వేగభరితం చేసే ఇతర ప్రముఖ జట్ల రూపం, శక్తిసామర్థ్యాల గురించి మనం ఆశ్చర్యపో కుండా ఉండలేం. థమ్స్ అప్ మార్గంగా ఇది మన భారీ ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్ర చార కార్యక్రమం కోసం మేం సంగ్రహించిన చర్చ. అధికారిక పానీయ భాగస్వాములుగా, మేం అన్ని ప్లాట్‌ఫామ్ లపై ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం, ఇది మా క్యాన్ లపై చర్చతో ప్రారంభమవుతుంది. ప్రపంచ కప్ సమీపిస్తున్న కొద్దీ మరింత తూఫాన్ గా మారుతుంది. ఇది మొదటి భాగం మాత్రమే. మరింత తూఫాన్ కోసం వేచి ఉండండి’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News