Monday, December 23, 2024

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఆసరా

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని దేవ ర కొండ శాసనసభ్యులు,బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీం ద్ర కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొం డమల్లేపల్లి మండలానికి చెందిన 36మందికి రూ.36లక్షల కల్యాణ లక్ష్మీ చెక్కులను,చీరలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళ్యాణ లక్ష్మీ సద్వి ని యోగం చేసుకోవాలని ఆయన కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియా డారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అ న్నా రు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ము ఖ్య లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథ కాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కా ర్యక్రమాలను అమలు చేస్తున్నదని, దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అ మలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎ ంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడ బిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుం బా లకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆయన అన్నారు.

ఆడబిడ్డ వివా హానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభు ్వం మన తెలంగాణ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశ పె ట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని…కేవలం బిఆర్‌ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆ యన అన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కు టు ంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు.

ఈ పథకాలతో రా ష్ట్ర వ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ కే ద క్కు తున్నదని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అ మ ల్లోకి వ చ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని రవీ ్ంర ద కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అ ధ్యక్షుడు కు ంభం శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి, జ డ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీ నివాస్ యాదవ్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు నేనావత్ రాంబాబు, నే నా వత్ శంకర్, బొడ్డుపల్లి కృష్ణ, బలరాం, లింగం యాదవ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News