Thursday, November 14, 2024

అంచేలంచెలుగా పనులు పూర్తి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అంచేల ంచలుగా త్వరలో పూర్తికానున్నాయని మున్సిపల్ కమిషన్ డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. శనివారం వార్డు వాచ్ కార్యక్రమంలో భాగంగా నల్లగొ ండ ప ట్టణంలోని వార్డ్ నెంబర్ 1 లో పర్యటించారు. చిన్నపాటి వర్షానికి నీటితో జామ్ అవుతున్నాయని, నేషనల్ హైవే వాళ్ళ ఆధ్వర్యంలో సంబంధించిన ట్రైన్ పనులు త్వరలోనే పూర్తవుతాయని పేర్కొన్నారు. పనులు పూర్తికాగానే రోడ్డు నిర్మా ణం చేపడతామన్నారు. వార్డులలో డ్రైనేజీల పనుల కు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు మ ంజూరు చేసినట్లు తెలిపారు.

జెసిబి లతో అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రం చేయాలని సిబ్బందికి సూ చించారు. వార్డు 1 లో మంచి టి సప్లై ప్రారంభమైందని తెలిపారు. చాలామంది ప్రజలు మంచి నీటిని డ్రైన్ ల లో వదులుతున్నారని అవసరానికి వాడుకొని వెంటనే నల్లను కట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. నీరు చా లా విలువైనది, ప్రకృతి సంపద అని నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాలనీలలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారని మున్సిపల్ వాహనాలకు చెత్త అందించి ప్ర జలు సహ కరించాలన్నారు.

షాప్ యజమానులు చెత్త ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ కా ర్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ, మున్సి పాలిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, నేషనల్ హైవే ఇంజనీర్ మురళి, మున్సిపాలిటీ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ వెంకన్న, మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ దిలీప్ రవీందర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ నాగదుర్గ ప్రసాద్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News