Monday, November 25, 2024

చాట్‌జిపిటితో సగటు బతుకుకు చేటు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : సృష్టికి ప్రతిసృష్టి వంటి కృత్రిమ మేధ (ఎఐ) క్రమేపీ మానవ జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఎఐ సంబంధిత చాట్‌జిపిటితో తన ఆదాయం ఇప్పుడు 90 శాతం వరకూ పడిపోయిందని కోల్‌కతాకు చెందిన విద్యార్థిని శరణ్య భట్టాచార్య వాపోయింది. తన డిగ్రీ చదువు చేస్తూనే ఆమె ఉత్సాహంగా ఓ క్రియేటివ్ సోల్యూషన్స్ సంస్థకు ఘోస్ట్‌రైటర్‌గా , కాపీరైటర్‌గా పనిచేసేది. ఆదాయం పొందేది. నెలకు తనకు ఈ విధంగా దాదాపు 240 డాలర్లకు పైగా అంటే రూ 20,000 వరకూ వచ్చేదని తెలిపింది. అయితే గత ఏడాది నవంబర్ నుంచి ఛాట్‌జిపిటి రంగంలోకి వచ్చిన తరువాత ఆమె జీవితం దెబ్బతింది.

తన ఆదాయ వనరులు పడిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకు ముందు నెలకు పలు ఆర్టికల్స్ రాసే అవకాశం వచ్చేదని, అయితే ఇటీవలి కాలంలో నెలకు ఒక్కటి లేదా రెండు ఆర్టికల్స్‌కు ఛాన్స్ వస్తోందని ఈ 22 ఏండ్ల యువతి తెలిపింది. తనకు ఆర్టికల్స్ రాసే పనికి కుదుర్చుకున్న సంస్థ దీనికి సంబంధించి ఎటువంటి కారణాలు చూపడం లేదని , అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఆర్టికల్స్ రాసే పనిని కృత్రిమ మేధ సాధనాలతో పూర్తి చేసుకుంటున్నారని తనకు తెలిసిందని, ఈ విధంగా తనకు ఛాట్‌జిపిటి విలన్ అయి కూర్చుందని తెలిపారు.

ఇంతకు ముందు దక్కేదానిలో ఇప్పుడు కేవలం పదిశాతం వస్తున్నదంటే గండి ఏ విధంగా ఉందనేది తెలుసుకోవచ్చునని చెప్పారు. ఇంతకు ముందు తను చదువుకుంటూనే తను తన తల్లి పోషణను చూసుకునేదానిని అని, చీరలు అమ్మి కొంత సంపాదన గడించే తన తల్లికి తనకు ఈ కొత్త పరిణామం పిడుగుపాటు అయిందన్నారు. సృజనాత్మక ఆలోచనలను ఇంతవరకూ మనిషి నేరుగా రూపొందిస్తూ ఉండగా , నిర్ధేశిత అంశంపై ఈ కృత్రిమ వేదిక మనిషి కన్నా వేగంగా వివిధ అంశాలపై సమగ్ర రూపంతో ఆలోచనాత్మక వ్యాసాలను సూచనలను అక్షరరూపంలో వెలువరిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News