Monday, November 25, 2024

బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలమే : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మరోసారి బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమన దిశలో వెళ్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర, జిల్లాల అధికార ప్రతినిధులు, జిల్లాల మీడియా ఇంచార్జ్‌లు సోషల్ మీడియా ప్రతినిధులకు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. ఆ పార్టీకి గడ్డుకాలం ఉందని అనేక సర్వేల్లో వాళ్లకు తెలిసింది కాబట్టే.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యేలను మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తెలంగాణకు ఏ రకంగా నిధులు ఇచ్చామో చెప్పేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది. జాతీయ రహదారుల నుంచి మొదలు.. గ్రామ పంచాయతీ రోడ్ల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందన్నారు. అమరవీరులు బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ.. కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా మారిందన్నారు.

కాంగ్రెస్, ఎంఐఎం, బిఆర్‌ఎస్ ఈ మూడు పార్టీలు కూడా.. ఒకే రకమైన డిఎన్‌ఏతో ఉన్న పార్టీలు.. కుటుంబ, అవినీతి పార్టీలు. 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా.. చేతి గుర్తుతో గెలిచి బిఆర్‌ఎస్‌లో చేరారని గుర్తుచేశారు. ఈ రోజైనా, భవిష్యతులో . కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒక్కటేనన అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తాం అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13, 14, 15 మూడు రోజులు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలను ఆయన కోరారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రతి ఇంటి నుంచి మట్టి సేకరించి.. ఢిల్లీలో స్మారక కేంద్రంలో కలిపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఇది దేశం కోసం అమరులైన వీరులకు నివాళి అర్పించే కార్యక్రమంలో ప్రతి గ్రామంలోని యువత భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల బాధ్యుడు ప్రకాశ్ జవదేకర్, జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇర్ఫాన్, సీతాశాల్ , జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News