సంతోష్ శోభన్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లు. లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. రైటర్ అభిషేక్ మహర్షి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ పరిచయ వేదిక కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ ఈవెంట్‌లో సంతోష్ శోభన్, రుచిత సాధినేని, రాశీ సింగ్, శివ ప్రసాద్, అభిషేక్ మహర్షి, ఎస్.అనంత శ్రీకర్, కాసర్ల శ్యామ్, అనిరుధ్ కృష్ణమూర్తి, ప్రభావతి, అశోక్ కుమార్, రోల్ రైడా, ధ్రువన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అభిషేక్ మహర్షి మాట్లాడుతూ “ఈ కథ ఫిక్స్ కావడానికి కారణం సంతోష్ శోభన్. అనంత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రాశీ సింగ్, రుచిత చక్కగా నటించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు”అని అన్నారు. నిర్మాత శివప్రసాద్ మాట్లాడుతూ “ఈ స్టోరీ నచ్చడంతో సంతోష్ ఈ సినిమా చేశాడు.
ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే లక్షంతో చేసిన సినిమా ఇది. ఈనెల 18న వస్తోన్న మా ‘ప్రేమ్ కుమార్’ను చూసి అందరూ నవ్వుకుంటారని భావిస్తున్నాను”అని పేర్కొన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “ఈ సినిమా తర్వాత అభిషేక్ మంచి డైరెక్టర్ అవుతాడు. భవిష్యత్తులో హ్యూమర్‌కు అభిషేక్ ఓ బ్రాండ్ అవుతాడని నమ్మకంగా ఉన్నాను”అని తెలిపారు.