మన తెలంగాణ/హైదరాబాద్: యువ క్రికెటర్లలోని ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డిసి) ఆధ్వర్యంలో అండర్14 స్కూల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. వర్ధమాన క్రికెటర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 3న ఫైనల్ సమరం జరుగుతుంది. కాగా, ఈ లీగ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఆసక్తిగల క్రికెటర్లు ఆగస్టు 17 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 20న హైదరాబాద్‌లోని ఎంఎస్‌డిసిఎ సెంటర్లలో సెలెక్షన్స్ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఆగస్టు 25న జట్ల పేర్లను ప్రకటిస్తారు. ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు పోటీ పడనున్నాయి. లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఐదుగురు క్రికెటర్లకు ఆరు నెలలపాటు ఎంఎస్‌డిసిఎ సెంటర్లలో ఉచిత శిక్షణ ఇస్తారు. కాగా, ఆసక్తిగల ఆటగాళ్లు 7396386214, 7618703508 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.