Friday, October 18, 2024

బీజేపీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

లక్నో: సమాజాన్ని చీల్చడానికి, తద్వారా అధికారం సాధించడానికి బీజేపీ తనదైన హిందుత్వ విధానాన్ని ఉపయోగిస్తోందని, సమాజ్‌వాది అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ శనివారం ధ్వజమెత్తారు. ఈ క్రమంలో వాస్తవ హిందుత్వను రక్షించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లను నిర్వహిస్తోందని, 2024 లో బీజేపీ ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్‌కౌంటర్ చేస్తారని, రాజ్యాంగాన్ని రక్షించడానికి అది అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. విభజించే విధానం కలిగిన బీజేపీ ప్రభుత్వాన్ని పిడిఎ (పిచ్చాడే, దళిత, అల్పసంఖ్యాక) మద్దతుతో ఉత్తరప్రదేశ్‌లో 2024లో కూకటివేళ్లతో పెకలించడమౌతుందని ఆయన జోస్యం చెప్పారు.

ఆంగ్ల వార్తా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వూలో బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అనేక విపక్షాలు ఇండియా కూటమిలో చేరడానికి ఆసక్తి చూపించడం స్వాగతించవలసిన పరిణామంగా ఆయన అభివర్ణించారు. తమ ‘పిడిఎ’ ఈసారి బిజేపిని ఓడిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ సమాచార మాధ్యమాన్ని దుర్వినియోగం చేస్తోందని, అబద్ధాలను ప్రతిరోజూ వ్యాప్తి చేస్తోందని, అధికారం లోకి వారు రాకుండా అడ్డుకోవడం తప్పనిసరి అని, దానివల్ల అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం రక్షింపబడుతుందని సూచించారు.

అసలైన హిందుత్వం అంటే మహిళల గౌరవాన్ని రక్షించేదని,వివక్షను అంతం చేసేది, పడవ నడిపే వారిని కూడా హత్తుకునేదని , ప్రేమను వ్యాపింప చేసేది, సహనాన్ని పెంచేది అని వివరించారు. ఈ సందర్భంగా రామాయణంలో పడవ నడిపే భృగుడిని రాముడు ప్రేమతో గుండెకు హత్తుకోవడాన్ని ఉదహరించారు. దీనికి బదులుగా తన రాజకీయ అజెండా సాధించడానికి బీజేపీ దేశం అంతా ద్వేషాన్ని వ్యాపింప చేస్తోందని, సామాజిక మైత్రిని చెడగొడుతోందని విమర్శించారు. ద్వేషాన్ని వ్యాపింప చేయడం, సమాజాన్ని చీల్చడం బీజేపీ మోడల్ అని , శాంతికి, అభివృద్ధికి బీజేపీ శత్రువని అఖిలేశ్ తూర్పార బట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News