Friday, November 15, 2024

లక్ష్మీనృసింహుడి దర్శనానికి పెరిగిన భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం తరలివచ్చే భక్తుల రద్దీ పెరిగింది. కొద్దిరోజులుగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ శనివారం వివిధ ప్రాంతాలతో కుటుంబ సభ్యులు, పిల్లాపాలతో వ స్తున్న భక్తుల రద్దీ పెరిగింది. శనివారం తెల్లవారుజామున 3:30 గ ంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు నిత్యపూజా కైంకర్యాలను చే పట్టారు.

శ్రీవారి ఆలయంలో అర్చన, అభిషేకం, సుదర్శన నారసిం హ హోమం, నిత్యకల్యాణ మహోత్సవం పూజలు అత్యంత వైభవం గా కొనసాగాయి. సువర్ణపుష్పార్చన, జోడిసేవ, దర్బార్ సేవ, సత్యనారాయణ వ్రతపూజలలో కూడా భక్తులు పాల్గొని తమ మొక్కుబడు లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైన కొలువుదీరిన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామిని కూడా భ క్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండకింద గల పాతలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయ నిత్యపూజలలో పాల్గొన్నారు.

శ్రీవారి నిత్యరాబడి…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్యరాబడిలో భాగం గా శనివారం రూ.22,68,269 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవస్థానం పరిధిలోని ప్రసాద విక్రయం, ప్రధాన బుకింగ్, వీఐపీ దర్శనం, బ్రేక్ దర్శనం, కొండపైకి వాహనాల అనుమతి, శివాలయం, పాతగుట్టతో పాటు వివిధ శాఖల నుంచి స్వామివారికి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీవారి సేవలో హైకోర్టు జడ్జి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె.సుజన దర్శించుకున్నారు. శనివారం స్వామివారిని దర్శించుకున్న జస్టిస్ సుజన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ సుజనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని జస్టిస్ సుజనకు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News