- Advertisement -
న్యూఢిల్లీ : ప్రత్యేకించి హిందూకుష్ పర్వతాలను కేంద్రీకృతం చేసుకుని శనివారం రాత్రి రెక్టర్‌స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో అఫ్ఘనిస్థాన్ మారుమూల ప్రాంతాలలో ప్రకంపనలు చెలరేగాయి. ప్రకంపనలు యూరేషియన్,ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్ కూడలి వద్ద ఉండటంతో దేశ రాజధాని ఢిల్లీ తదితర ప్రాంతాలలో కూడా భూమి స్వల్ప స్థాయిలో కంపించింది.
ఉత్తరభారతంలోని పంజాబ్, జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప కేంద్రం డైరెక్టర్ జెఎల్ గౌతమ్ శనివారం రాత్రి తెలిపారు. భూమిలోపల 181 కిలోమీటర్ల అడుగున ప్రకంపనల కేంద్రం నెలకొని ఉంది. ఈ పరిణామంతో ప్రాణనష్టం, గాయపడ్డ వారి సంఖ్య గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అయితే అఫ్ఘనిస్థాన్‌లోని లోతట్టు, పర్వతప్రాంతాలలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
- Advertisement -