- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం కింద 13.44లక్షల ఎకరాల్లో అంతరించిపోయిన అడవులును తిరిగి పునరుద్దరించగలిగామని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 2015నుండి ఇప్పటివరకూ రాష్ట్రంలో 284కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు. 109పట్టణాల్లో పార్కులను అభివృద్ధిపరచగలిగామన్నారు. రాష్ట్రంలో 14864 నర్సరీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 19472 పల్లె ప్రకృతి వనాలు అభివృద్ధి చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి హరిత నిధి పేరుతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
- Advertisement -