రెండవ ప్రపంచ యుద్ధం సెప్టెంబర్ 1,1939 నుండి సెప్టెంబర్ 2,1945 వరకు జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం అమెరికా జపాన్‌పై రెండు అణుబాంబులు వేయడం ద్వారా ముగిసింది. ఇది మానవాళి చరిత్రలో మచ్చగా మిగిలిపోయింది. ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయింది జపాన్. జపానులో అభము శుభము ఎరుగని ప్రజలు వేల సంఖ్యలో మరణించారు. చరిత్ర పుటల్లో చూస్తే.. రెండవ ప్రపంచ యుద్ధం 30 కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న అతిపెద్ద, ఘోరమైన యుద్ధం. పోలాండ్‌పై 1939 నాజీ దండయాత్రతో చెలరేగిన యుద్ధం, 1945లో నాజీ జర్మనీ, జపాన్, ఇటలీ అక్ష శక్తులను మిత్ర రాజ్యాలు ఓడించే వరకు ఆరు రక్తపాత సంవత్సరాల పాటు సాగిన సంగ్రామం. జపాన్ ఆసియాలో తన సామ్రాజ్యాన్ని విస్తరించడం అమెరికా సహించలేకపోయింది.
తన కంటే ఎక్కువ శక్తిగల దేశంగా జపాన్ బలపడిపోతుందేమోనన్న ఆందోళన, భయం అమెరికాకి ఉంది. దీనితో పాటుగా మిత్ర దేశమైన చైనాకు అప్పటికే సైనిక సహాయాన్ని అందిస్తూ ఉంది. చైనా నుండి జపాన్ వైదొలగాలని అమెరికా కోరుకుంది. ఇంకా యునైటెడ్ స్టేట్స్ గ్రేట్ బ్రిటన్, నెదర్లాండ్స్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ రెండింటికీ ఆగ్నేయాసియాలో జపాన్ బెదిరింపులకు గురైన కాలనీలు ఉన్నాయి. జపాన్‌తో ప్రత్యక్షంగా యుద్ధం చేయాలని లోపల కోరికున్నప్పటికీ అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ యునైటెడ్ స్టేట్స్ మరొక దేశంతో యుద్ధం తనంతట తానుగా ప్రారంభిం చదని తన దేశాల ప్రజలకు వాగ్దానం చేసున్నాడు. జపానే తనంతట తానుగా అమెరికాపై దాడి చేస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో జపానుపై సమరం చేయవలసి వచ్చిందని తన ప్రజలకు నమ్మించగలమనే ఒక దురాలోచనతో మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పట్లో జపాన్ తన చమురు అవసరాలకు ఎక్కువుగా అమెరికాపై ఆధారపడింది. దీనిని రూజ్‌వెల్ట్ తనకి అనుకూలంగా మార్చుకున్నాడు.
జపాన్‌పై చమురు నిషేధాన్ని విధించా డు. చమురు నిషేధంపై జపాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు దీనిని యుద్ధ చర్యగా భావించారు, వారు డిసెంబర్ 7, 1941న పెర్ల్ నౌకాశ్రయంపై ఆకస్మిక దాడిని ప్రారంభించడం ద్వారా ప్రతిస్పందించారు. ఈ దాడి యునైటెడ్ స్టేట్స్‌ను రెండవ ప్రపంచ యుద్ధంలోకి తీసుకు వచ్చింది. ఇది 1945లో జపాన్ ఓటమికి ఈ యుద్ధంలో భాగంగా అమెరికా జపాన్‌పై అణుబాంబుల ను ప్రయోగించింది. లిటిల్ బాయ్‌గా పేరు పెట్టబడిన మొదటి అణుబాంబును ఆగస్టు 6, 1945 సంవత్సరం ఉదయం 8:15 గంటలకు హిరోషిమాపై పడవేసింది. అప్పటి నుండి ఈ తేదీని హిరోషిమా దినంగా పిలుస్తున్నా రు. అణుబాంబులు అపారమైన పేలుడు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి రేడియో ధార్మిక మూలకాలైన యురేనియం, ఫ్లుటోనియంతో తయారు చేస్తారు. లిటిల్ బాయ్, హిరోషిమాపై వేయబడిన బాంబు అనేది యురేనియం ఉపయోగించి తుపాకీ -అసెంబ్లీ కేంద్రక విచ్ఛిత్తి బాంబు అయితే, ఫ్యాట్ మ్యాన్ అనేది నాగసాకిపై వేసిన బాంబు ప్లూటోనియం ఉపయోగించిన ఒక ఇంప్లోషన్ విచ్ఛిత్తి బాంబు. ఇవి కేంద్రక విచ్ఛిత్తి లేదా కేంద్రక సంలీనం చేయడం ద్వారా శక్తినివిడుదల చేస్తాయి . వీటి తయారీలో ఉపయోగించిన సూత్రం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ రూపొందించా రు. కానీ అణుబాంబులను మాత్రం ఆయన తయారు చేయలేదు. తయారు చేసింది ఒట్టహాన్ శాస్త్రవేత్త.
అణ్వా యుధం మొదటి పరీక్ష యునైటెడ్ స్టేట్స్‌లో జులై 16, 1945న దక్షిణ- మధ్య న్యూ మెక్సికోలోని అలమోగోర్డో బాంబింగ్ రేంజ్‌లో జరిగింది. పరీక్షకు ట్రినిటీ అనే కోడ్ పేరు పెట్టారు.అణ్వాయుధాలు అపారమైన పేలుడు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. హిరోషిమాపై వేయబడిన బాంబులో 64 కిలోల అత్యంత సుసంపన్నమైన యురేనియాన్ని ఉపయోగించా రు. ఇది విడుదల చేసిన శక్తి 64 కిలో టన్నుల సాంప్రదాయ టి.యన్.టి విడుదల చేసిన శక్తికి సమానం. ఈ పేలుడు అపారమైన వేడిని, ప్రాణాంతక అయానీకరణ రేడియేషన్‌ను ఉత్పత్తి చేసింది. ఇది సృష్టించిన ఉష్ణ ప్రసరణ ప్రవాహాలు దుమ్ము, ఇతర శిథిలాలను గాలిలోకి లాగి, పుట్టగొడుగు ఆకారపు మేఘాన్ని సృష్టించాయి. రేడియో ధార్మిక శిథిలాలు వాతావరణంలోకి ఎత్తైన గాలుల ద్వారా తీసుకు వెళ్లబడ్డాయి. తరువాత రేడియో ధార్మిక పతనంగా భూమిపై స్థిరపడ్డాయి. మొదటి లక్ష్యంగా హిరోషిమాని ఎంచుకోడానికి గల కారణాలు ఈ ప్రదేశంలో అమెరికా మిత్ర రాజ్యాల యుద్ధ శిబిరాలు లేకపోవడం, ఈ నగరం లో జపాన్ సైనిక దళాలు, సైనిక కర్మాగారాలు ఉండడం, ఈ నగరం జనాభా చాలా దట్టంగా ఉండడం, అంతకుముందు జరిపిన వైమానిక దాడులలో ఈ నగరం పెద్దగా దెబ్బతినకపోవడం, అణుబాంబు శక్తిని పరీక్షిం చడానికి అనుకూలంగా భావించబడడం.
నాగసాకిని ఎంచుకోడానికి గల కారణం అక్కడ రెండు అతిపెద్ద యుద్ధ నౌకలను నిర్మించిన మిత్సుబిషి షిప్‌యార్డ్ ఉంది. జూన్ 30, 1946న, యుఎస్‌ఎ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్, హిరోషిమా, నాగసాకిపై జరిగిన బాంబు దాడుల అధికారిక పరిశోధన ఫలితాలను బహిరంగపరిచింది. ఇది అమెరికా వ్యూహాత్మక బాంబింగ్ సర్వే, జపాన్‌కు బ్రిటిష్ మిషన్, అటామిక్ బాంబ్ క్యాజువాలిటీ కమిషన్ ద్వారా నివేదించబడిన నివేదిక. ఇది మాన్‌హట్టన్ ప్రాజెక్ట్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు సంకలనం చేశారు. హిరోషిమాలో 1,35,000 మంది లేదా దాని జనాభాలో సగానికి పైగా మరణించారని ఈ నివేదిక పేర్కొంది. వీటిలో అత్యధిక సంఖ్యలో బాంబు దాడి జరిగిన వెంటనే సంభవించాయని 195,000 జనాభా కలిగిన నాగసాకిలో 64,000 మంది మరణించారని తెలిపింది.
* డిజె మోహనరావు- 9440485824