Sunday, November 24, 2024

ఆర్టీసి ఉద్యోగులకు పింఛన్, పే స్కేల్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు

- Advertisement -
- Advertisement -

ఆర్టీసి విలీనాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎంఎల్ సి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ లో కాంగ్రెస్ ఎంఎల్ సి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. “ఆర్టీసి కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడడం మంచిదే. పింఛన్, పే స్కేల్ ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ద్వారా గవర్నర్ కు వివరణ ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలు పొడిగించైనా ఆర్టీసి బిల్లును ఆమోదించాలి” అని పేర్కొన్నారు.

కాగా, ఆర్టీసి బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆర్టీసి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ అమోదం కోసం పంపించగా.. బిల్లుపై గవర్నర్ పలు సందేహాలను లేవనెత్తుతూ వివరణ కోరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News