Friday, November 15, 2024

చలో అసెంబ్లీ…. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చలో అసెంబ్లీ పిలుపుతో పెద్ద ఎత్తున ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు తరలి వచ్చారు. పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయంబర్స్‌మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలలోకి విద్యార్థి సంఘాలను అనుమతించవద్దనడాన్ని నిరసిస్తూ ముట్టడి చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు సొంతభవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. నూతజ జాతీయ విద్యావిధానాన్ని తెలంగాణలో అమలు చేయకూడదన్నారు.

Also Read: పాముతో ప్రేమలో పడిన ఆవు (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News