Monday, January 20, 2025

ఆర్టీసి భూములపై కెసిఆర్ కుటుంబం కన్ను పడింది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసి భూములపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం కన్ను పడిందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మీడియాతో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసి బిల్లుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వేలాది ఏకరాల ఆర్టీసి భూముల మీద సిఎం కెసిఆర్ కుటుంబం కన్నేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదోరకంగా ఆర్టీసి భూములను అమ్ముకోవాలని కెసిఆర్ చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉన్నట్టుండి ఆర్టీసి ఉద్యోగుల మీద కెసిఆర్ కు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. ఆర్టీసి విలీనానికి బిజెపి పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. ఆర్టీసి బిల్లుపై బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News