- Advertisement -
హైదరాబాద్: ప్రజాగాయకుడు, యుద్ధనౌక గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. గద్దర్ మరణం తనని ఎంతో బాధించిందని రాహుల్ తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం గద్దర్ అలుపెరగని పోరాటం చేశారని, ఆయన నిరంతరం బడుగుల తరుపున వాణి వినిపించారని గుర్తు చేశారు. గద్దర్ చూపిన బాటలో ముందుకు సాగుతామన్నారు. ఖమ్మం కాంగ్రెస్ సభలో గద్దర్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
Also Read: తెలంగాణను ముంచింది కాంగ్రెస్, నెహ్రూ: కెసిఆర్
- Advertisement -