అమలాపురం: ప్రియురాలు, ఇద్దరు పిల్లలను ఫొటో తీసుకుందామని చెప్పి వారిని నదిలో నెట్టేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామానికి చెందిన సుహాసిని(36) భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. సురేష్‌తో సుహాసిని గత కొన్ని రోజుల నుంచి సహాజీవనం చేస్తోంది. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను చంపేయాలని సురేష్ నిర్ణయం తీసుకున్నాడు. సుహాసినికి కారు కొనుగోలు చేద్దామని ఇద్దరు పిల్లలతో సహా రమ్మని కబురు పంపాడు. రావులపాలెం వంతెన మీదకు రాగాను ఫొటో తీసుకుందామని అక్కడ ఆగారు. ఫొటో తీసుకుంటుండగా సుహాసిని, జెర్సీ, కీర్తనను గోదావరి నదిలోకి నెట్టేశాడు. అనంతరం సురేష్ అక్కడి నుంచి పారిపోయాడు. కీర్తన కింద పడిపోతుండగా కేబుల్ గొట్టాన్ని పట్టుకొని అలాగే ఉండిపోయింది. కీర్తన పైకి వచ్చి 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: గద్దర్ మృతిపై సిఎం జగన్ దిగ్భ్రాంతి