Saturday, December 21, 2024

యుపిలో ఇద్దరు బాలురచే మూత్రం తాగించిన దారుణం

- Advertisement -
- Advertisement -

లక్నో : దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలురచే బలవంతంగా మూత్రం తాగించిన సంఘటన సంచలనం కలిగించింది. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్ధ నగర్ జిల్లాలో 10,15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురను దొంగతనం చేశారనే ఆరోపణపై కొందరు కట్టేసి కొట్టారు. వారితో పచ్చిమిర్చి తినిపించారు. బాటిల్‌లో ఉన్న మూత్రాన్ని బలవంతంగా తాగించారు. వారిని బోర్లా పడుకోమని చెప్పి దుస్తులు తొలగించారు.

వారి ప్రైవేట్ భాగాలపై మిరపకాయలు రుద్దించారు. పచ్చని రంగులో ఉన్న ద్రవాన్ని ఇంజెక్షన్ చేశారు. ఈ హింసకు బాలురు విలవిల్లాడిపోయారు. ఆగస్టు 4న పత్రా బజార్ పోలీస్‌స్టేషన్ పరిధి లోని అర్షన్ చికెన్‌షాప్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఒక పోలీస్ చూసి ఉన్నతాధికారులకు తెలియజేశాడు. దాంతో పోలీస్‌లు రంగం లోకి దిగి ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News